జనగామ రూరల్: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జనగామ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని బతుకమ్మకుంట వద్ద 5కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనగామ రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కసాబు రమేశ్ మాట్లాడుతూ.. వీర జవాన్ల త్యాగాన్ని ప్రతీ భారతీయుడు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రన్నర్స్ గౌరవ అధ్యక్షుడు పానుగంటి శ్రీని వాస్, పిట్టల సత్యం, మల్లికార్జునాచారి, అబ్బాస్, రాంచందర్, ఆంజనేయులు, శ్రీరాముల మల్లేష్, బాల్ని నాగరాజు, నల్ల మధు, అరవింద్, మురళీకృష్ణ, చంద్రశేఖర్, శాడ పోచయ్య, నవీన్, కుమారస్వామి, భాస్కర్, శ్రవణ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధికి
కృషిచేయాలి
జనగామ రూరల్: మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధికి మాస్టర్‌లు సమష్టిగా కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు ఓరుగంటి సంతోష్ కుమార్ అన్నారు. ఆదివారం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ అధ్యక్షతన ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తంగా మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధికి యువతలో ఆత్మరక్షణ నైపుణ్యాలు, క్రమశిక్షణ పెంపొందించేందుకు శిక్షణా కార్యక్రమాలు, సభ్య త్వ నమోదు, జిల్లా స్థాయి పోటీల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ మాస్టర్స్ అడ్వైజరీ కమిటీ మెంబర్ పెచ్చెట్టి త్రివిక్రమ్ రావ్, వైస్ ప్రెసిడెంట్ బానోత్ బాలు కుమార్, చెరుపల్లి అశోక్, అసోసియేషన్ సభ్యులు అశ్విని, ఎండీ పాషా తదితరులు పాల్గొన్నారు.
రూ.2.50లక్షల ఎల్‌ఓసీ
అందజేత
చిల్పూరు: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాధితురాలికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి భారీ ఎల్‌ఓసీ అందించారు. మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన కేశిరెడ్డి సునీత అనా రోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఎమ్మెల్యే కడి యం శ్రీహరి చొరవతో బాధితురాలి వైద్య ఖ ర్చుల నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2.50 లక్షల ఎల్‌ఓసీని ఆదివారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎంఆర్‌ఎఫ్ పేదల పాలిట సంజీవని అన్నారు.
బలాకా, విజయా క్రమాల్లో భద్రకాళి అమ్మవారు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శాకంబరీ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అమ్మవారికి బలా కా, విజయా క్రమాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు నిత్యాహ్నికపూజలు చతుస్థానార్చనలు చేశారు. స్నపనమూర్తిని కాళీకల్పకం ప్రకారం బలాకా అమ్మవారుగా, బోగభేరాన్ని షోడశీక్రమంలో విజయా నిత్యగా అలంకరించారు.
ప్రశాంతంగా ఉచిత కోచింగ్ అర్హత పరీక్ష
కేయూ క్యాంపస్: ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా అభ్యర్థుల కోసం సివిల్ సర్వీసెస్‌లో ఉచిత శిక్షణ కోసం నిర్వహించిన అర్హత పరీక్ష ఆదివారం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రశాంతంగా ముగిసింది. కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి నిర్మల, ఎస్సీ స్టడీ సర్కిల్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ జగన్‌మోహన్ పర్యవేక్షించారు.


