విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడొద్దు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడొద్దు

Jul 26 2026 2:08 AM | Updated on Jul 26 2026 2:08 AM

జనగామ రూరల్‌: నీట్‌ పేపర్‌ లీకేజీ ఘటనలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం కాంగ్రెస్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెహ్రూ పార్కు నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతీ లక్ష్మీనారాయణ నాయక్‌ పాల్గొని విద్యార్థుల పోరా టానికి సంఘీభావం ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడే విధానాలను సహించబోమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కొమ్మూరి మాట్లాడుతూ..మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేసి రాహుల్‌ గాంధీకి అప్పగించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి, జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్‌చంద్రారెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ మారజోడు రాంబాబు, నామాల బుచ్చయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వినయ్‌ కుమార్‌, కౌన్సిలర్లు దిలీప్‌ కుమార్‌ రెడ్డి, వేముల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్‌, చింతకింది మల్లేశం పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో

కొవ్వొత్తుల ర్యాలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement