గణితంలో ఎవరూ ఫెయిల్‌ కావొద్దు | - | Sakshi
Sakshi News home page

గణితంలో ఎవరూ ఫెయిల్‌ కావొద్దు

Jul 25 2026 1:05 AM | Updated on Jul 25 2026 1:05 AM

లింగాలఘణపురం: గణితం ప్రత్యేకమైన సబ్జెక్ట్‌ అని అందులో రాబోయే పదో తరగతిలో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్‌ కావొద్దని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. మండలంలోని నెల్లుట్ల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు జరుగుతున్న సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గణితంలోని ప్రతీ అంశాన్ని సూత్రాలకే పరిమితం కాకుండా సులభంగా అర్థం చేసుకొనే విధంగా దృశ్యీకరణ పద్ధతిలో బోధించాలని సూచించారు. ఉపాధ్యాయులు గణితం అంటే భయం కాకుండా ఆసక్తిని పెంచే విధంగా బోఽధించాలని అన్నారు. ప్రతీ రోజు ఫాస్ట్‌ మ్యాథ్స్‌ అంశంపై తప్పనిసరిగా చెప్పాలన్నారు. ఆల్‌జీబ్రా, లాగరిథమ్స్‌, పాలినామియల్‌, ఈక్వేషన్స్‌ వంటి సమస్యలను ఇచ్చి పరిష్కార విధానాన్ని వివరించాలని ఉపాధ్యాయులకు చెప్పారు.

కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement