లింగాలఘణపురం: విద్యార్థుల్లో నేర్చుకోవాలనే ఆసక్తి పెంచే విధంగా ఉపాధ్యాయుల బోధన తీరు ఉండాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. బుధవారం మండలంలోని నెల్లుట్ల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ శిబిరంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు..ప్రతీ ఉన్నత పాఠశాలలో ప్రపంచ పటం, దేశ భౌతిక, రాజకీయ పటాలతో పాటు రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలు ఆర్టికల్స్‌ను ప్రదర్శించే సమాచార పట్టికలు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ప్రపంచ పటంలో వివిధ దేశాల స్థానాలు, భౌగోళిక అంశాలపై ఉపాధ్యాయులను ప్రశ్నించి వారి పరిజ్ఞానాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు సులభ పద్ధతిలో గణితం బోధించి వారిలో ఆసక్తిని పెంచారు.
కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా


