ఏఐతో ప్రజా సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

ఏఐతో ప్రజా సమస్యల పరిష్కారం

Jul 17 2026 1:10 AM | Updated on Jul 17 2026 1:10 AM

వివిధ విభాగాల అధికారులకు సమాచారం, ఆదేశాలను త్వరగా చేరవేసేందుకు ఏఐ ఎంతో ఉపయోగపడుతుంది. సాధారణంగా అయితే డ్రాఫ్ట్‌ రెడీ చేసుకునేందుకు గంటల సమయం తీసుకుంటుంది. అదే ఏఐకి సరైన ప్రాంప్ట్‌ ఇస్తే సెకన్ల వ్యవధిలోనే డ్రాఫ్ట్‌ రెడీ అవుతుంది. కోర్టు కేసుల్లోనూ 100 నుంచి 150 పేజీల డాక్యుమెంట్‌ ఉన్న కాపీలను గూగుల్‌ క్ల్లౌడ్‌లో స్కాన్‌ చేసి ఒక పేజీలో ముఖ్యమైన సారాంశం ఇవ్వాలని సరైన ప్రాంప్ట్‌ ఇస్తే సెకన్లలో సిద్ధమవుతుంది. అలాగే, అధికారులు కూడా తమ రోజువారీ పనుల్లో ఏఐ వాడితే ప్రజాసమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫైళ్ల కదలికలో వేగం పెరుగుతుంది. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం తగ్గుతుంది. ప్రభుత్వ సేవలు త్వరగా చేరువ అవుతాయి. పారదర్శకత పెరుగుతుంది. – డాక్టర్‌ సత్యశారద, వరంగల్‌ కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement