హోటళ్లు, బార్‌లలో ఆకస్మిక తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

హోటళ్లు, బార్‌లలో ఆకస్మిక తనిఖీలు

Jul 15 2026 12:47 AM | Updated on Jul 15 2026 12:47 AM

జనగామ: మున్సిపాలిటీ, ఫుడ్‌ సేఫ్టీ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, ఆహార విక్రయ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత ప్రమాణాలు పాటించని యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయడంతో పాటు సంబంధిత నిబంధనల ప్రకారం మొత్తం రూ.85 వేల జరిమానా విధించారు. అమృత బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు రూ.20 వేలు, భువన బార్‌కు రూ.10 వేలు, వినాయక బార్‌కు రూ.30 వేలు, బాలాజీ బార్‌కు రూ.10 వేలు, బాలాజీ స్వీట్‌ హౌస్‌కు రూ.5వేలు, అగర్వాల్‌ స్వీట్‌ హౌజ్‌కు రూ.10 వేల చొప్పున జ రిమానాలు విధించారు. తనిఖీల్లో మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి పాటు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు, మున్సిపల్‌ అధికారులు గొర్రె కుమార్‌, పులి శేఖర్‌, నిఖిల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement