● ట్రాన్స్‌కో సూపరింటెండింగ్ ఇంజనీర్ సంపత్‌రెడ్డి
బచ్చన్నపేట : విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి జిల్లాలో విద్యుత్ సరఫరాలో మరో ముందడుగు వేశామని ట్రాన్స్‌కో సూపరింటెండింగ్ ఇంజనీర్ చెరుకు సంపత్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని రామచంద్రాపూర్ ట్యాపింగ్ పాయింట్ నుంచి పడమటి కేశ్వాపూర్ 33/11 కేవీ సబ్‌స్టేషన్ వరకు సుమారు 6 కిలోమీటర్ల పొడవున 33 కేవీ లింక్ లైన్ నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు. ఈ కొత్త 33 కేవీ లింక్ లైన్ ద్వారా పడమటి కేశ్వాపూర్ సబ్‌స్టేషన్‌న్‌కు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా మార్గం అందుబాటులోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఆపరేషన్స్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి , డీఈ ఎం.సీ. విజయ్, జనగామ ఏడీఈ వేణుగోపాల్, కన్‌స్ట్రక్షన్ ఏడీఈ స్వామిరెడ్డి, ఏఈ సతీష్, కన్‌స్ట్రక్షన్ ఏఈ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


