● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కావాలని 41 కేజీల కంటే ఒక్క గింజ ఎక్కువ తూకం వేసిన చర్యలు తప్పవని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హెచ్చరించారు. మంగళవారం జనగామ మండలం పెద్దపహాడ్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి ఽకొనుగోలు ప్రక్రియ, లోడింగ్, ట్యాబ్ ఎంట్రీని పరిశీలించారు.
ఇళ్ల గణన ప్రక్రియ పారదర్శకంగా జరగాలి
మొదటి విడతలో భాగంగా ఇళ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జనగామ మండలం పెద్ద పహాడ్, జనగామ మున్సిపాలిటీలోని 13వ వార్డులో జరుగుతున్న ఇళ్ల గణన ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.
సర్టిఫికెట్ కోర్సుల పోస్టర్ ఆవిష్కరణ
ఆన్ మ్యూజియాలజీ, ఆర్కియాలజీ కోర్సుల పోస్టర్‌ను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆవిష్కరించారు. కోర్సులు పూర్తి చేయడం ద్వారా పర్యాటక, పురావస్తు మ్యూజియం రంగాలలో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మరిన్ని వివరాలకు 9849905722, 9849905723 నంబర్‌లను సంప్రదించాలన్నారు.
కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలి
జనగామ: జిల్లాలోని ఐకేపీ, పీఏసీఎస్, మార్క్‌ఫెడ్ కేంద్రా ల నుంచి మొక్కజొన్న, ధా న్యం సరుకును వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో కొనుగోళ్ల ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డీఆర్‌డీఓ భాస్కర్, మార్క్‌ఫెడ్ డీఎం చంద్రశేఖర్, డీసీఓ కోదండరాములు, డీఎంఓ రామకృష్ణ, అదనపు డీఆర్‌డీఓ నూరుద్దీన్, పౌరసరఫరాల సంస్థ డీఎం హతిరామ్, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, డీసీఎస్‌ఓ సురేష్ రెడ్డి, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ ఉన్నారు.
శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలి
జిల్లా గిరిజన గ్రామాల్లో ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి జంజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం–జేఏఎన్‌ఎంఏఎన్), ధర్తీ ఆబజం జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్(డీఏ–జేజీయూఏ) అమలు వేగవంతం చేసి, అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి పథకాల ప్రయోజనాలు చేరేలా అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.


