తల్లి ఆరోగ్యంతోనే ప్రజారోగ్య పురోగతి | - | Sakshi
Sakshi News home page

తల్లి ఆరోగ్యంతోనే ప్రజారోగ్య పురోగతి

Apr 9 2026 7:35 AM | Updated on Apr 9 2026 7:35 AM

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

జనగామ: తల్లి ఆరోగ్యం ప్రజారోగ్య పురోగతికి అద్దం పడుతుందని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య వారోత్సవాల్లో మూడో రోజు బుధవారం జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయం కాన్ఫరెన్స్‌ హాల్లో సురక్షిత మాతృత్వ దినోత్సవ వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ.. హైరిస్క్‌ గర్భిణులను ప్రారంభదశలోనే గుర్తించడం, సమయానికి నాణ్యమైన సేవలు అందించడంలో ఆశా, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ సిబ్బంది కీలకపాత్ర పోషించాలన్నారు. జిల్లాలో సాధారణ ప్రసవాల శాతం పెంచేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మల్లికార్జునరావు, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ నరేందర్‌ శర్మ, జీజీహెచ్‌ఎస్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజలింగం, డీడబ్ల్యూఓకోదండరాములు, ప్రోగ్రామింగ్‌ అధికారి డాక్టర్‌ శ్రీహర్ష, గైనకాలజిస్టులు సునీత, అపర్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈవీఎం గోదాం పరిశీలన

జనగామ రూరల్‌: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నెలవారీ తనిఖీలో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్‌ బెన్షాలోమ్‌తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, మంటల నియంత్రణ పద్ధతులను పర్యవేక్షించారు. పరిశీలనలో జనగామ ఆర్డీఓ గోపీరాం, ఎన్నికల సూపరింటెండెంట్‌ శ్రీధర్‌, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement