జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో యాసంగి సీజన్‌లో పకడ్బందీగా కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తామని ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అన్నారు. శనివారం చైర్మన్ ఆధ్వర్యంలో మార్కెట్ కార్యాలయంలో రైస్ మిల్లర్స్, ఎగుమతిదారులు, అడ్తి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజన్‌లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సమావేశంలో రైతు సంఘం నేతలు చందూ నాయక్, సొప్పరి సోమయ్య, రైస్ మిల్లర్స్ పజ్జూరి జయహరి, ముత్తయ్య యాదవ్, మాశెట్టి అశోక్, అడ్తి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు మాశెట్టి వెంకన్న, వ్యాపారులు కృష్ణారెడ్డి, నరసింహులు, రవి, శ్రీనివాస్, ఉపేందర్, ఏఎంసీ సూపర్‌వైజర్ శ్రీనివాస్ ఉన్నారు.


