ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలి

Mar 26 2026 7:51 AM | Updated on Mar 26 2026 7:51 AM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలి

స్టేషన్‌ఘన్‌పూర్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ పథకంలో భాగంగా లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని గృహనిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్‌ అన్నారు. మండలంలోని ఇప్పగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్‌ మందపురం రాణిఅనీల్‌గౌడ్‌ అధ్యక్షతన ఇందిరమ్మ లబ్ధిదారులతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పీడీ మాట్లాడారు.. లబ్ధిదారులుగా ఎంపికై ఇంతవరకూ పనులు ప్రారంభించని వారు వెంటనే పనులను చేపట్టాలన్నారు. లేనిపక్షంలో ఇళ్ల మంజూరు రద్దయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో హౌజింగ్‌ డీఈ చంద్రశేఖర్‌, ఏఈ అఖిల, ఉపసర్పంచ్‌ లింగనబోయిన రాజు పాల్గొన్నారు.

హౌజింగ్‌ పీడీ మాతృనాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement