రైతులు ఇబ్బందులు పడొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులు ఇబ్బందులు పడొద్దు

Mar 25 2026 7:26 AM | Updated on Mar 25 2026 7:26 AM

జనగామ రూరల్‌: యాసంగి సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు నిర్వహణ ప్రక్రియ సజావుగా జరగాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వ్యవసాయ, మార్కెట్‌, రవాణా, గ్రామీణాభివృద్ధి, కో–ఆపరేటివ్‌, తదితర శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాలకు వచ్చే ధాన్యం కొనుగోళ్లు పక్కాగా జరగాలన్నారు. ఏ రోజు వచ్చే ధాన్యం అదే రోజు కొనుగోలు చేసి ట్యాగ్‌ చేసిన మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. టార్పాలిన్లు, ధాన్యం శుద్ధి చేసే యంత్రాలు, గన్నీ సంచులు, వెయింగ్‌ మెషీన్‌లు తదితర పరికరాలు అన్నీ కొనుగోలు కేంద్రాల్లో సరిపడా అందుబాటులో ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఓ వసంత, జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ, డీఎం సీఎస్‌ హతీరాం, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌ గౌడ్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

జనాభా లెక్కింపు ప్రక్రియపై అవగాహన ఉండాలి

జనాభా లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సూచించారు. జనగణన 2027 ఫేజ్‌ 1 గృహాల జాబితా, గృహ గణన నిర్వహణలో భాగంగా నూతనంగా ఎంపికై న టెక్నికల్‌ అసిస్టెంట్లు, జనాభా లెక్కల ఛార్జ్‌ క్లర్క్‌లకు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్లో మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఓ చినకోట్యా నాయక్‌, జేడీ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి

దేవరుప్పుల: విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సూచించారు. మంగళవారం మండలంలోని పెద్దమడ్డూర్‌ హైస్కూల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు, మధ్యాహ్న భోజన సరుకుల నిల్వ రిజిస్టర్లు, అకౌంట్‌ రికార్డులతోపాటు గదుల్లో ఉన్న సామగ్రిని పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతీ రోజు విద్యా ర్థుల కు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించాల న్నారు. విద్యార్థులతో రాగి జావ ఎలా ఉంది? అని అడగ్గా విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. పరిశీలనలో హెచ్‌ఎం అశోక్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement