జనగామ రూరల్: ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అద్యక్షుడు సౌడ రమేష్ విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని, గృహిణులకు రూ.2,500 ఇస్తామని మోసం చేశారన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయాలని సోమవారం చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కేవీఎల్‌ఎన్ రెడ్డి, ఉడుగుల రమేశ్, డాక్టర్ భిక్షపతి, తోకల ఉమారాణి, డాక్టర్ శశిధర్ గుప్తా, ఆవుల శ్రీనివాస్, పూర్ణచంద్రరావు, పెద్దోజు జగదీష్, శివ, మురళి నాగరాజు, గంధం రాములు తదితరులు పాల్గొన్నారు.


