మబ్బులతో గుబులు | - | Sakshi
Sakshi News home page

మబ్బులతో గుబులు

Mar 23 2026 8:44 AM | Updated on Mar 23 2026 8:44 AM

చల్లబడుతున్న వాతావరణం..రైతన్నకు టెన్షన్‌ 2లక్షల ఎకరాల్లో సాగు మరో 15 రోజులు కీలకం వరుణుడు కరుణించాలని రైతుల ప్రార్థన

జిల్లాలో యాసంగి పంటల సాగు: ఎకరాల్లో

వర్షం పడితే బతుకు ఆగమే

చల్లబడుతున్న వాతావరణం..రైతన్నకు టెన్షన్‌

జనగామ: యాసంగి సీజన్‌ కీలక దశలో ఎండలు, మేఘాల దోబూచులాటతో రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఏటా మార్చి, ఏప్రిల్‌ వచ్చినప్పుడల్లా అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలులు రైతులను ఆర్థికంగా నష్టపోయేలా చేస్తుండగా, ఈసారి కూడా అదే భయం తిరిగి మొదలైంది. ఉదయం మండే ఎండ లు, మధ్యాహ్నం తర్వాత ఆకాశాన్ని కమ్మేసే మబ్బులు ఇలా మారే వాతావరణ పరిస్థితులు వ్యవసాయ క్షేత్రాల్లో ఆందోళన పెంచుతున్నాయి. రెండు లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటలు పొట్ట దశలో ఉండగా.. ఇంకో 15 రోజులు రైతులకు పరీక్ష సమయం.

యాసంగి పంటలు పొట్ట దశలో ఉన్న సమయంలో ఆకాశం మబ్బులతో హడలెత్తిస్తోంది. జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తుండటం రైతుల కలవరపాటుకు గురవుతున్నారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి, ఆరుగాలం చెమటోడ్చి పండిస్తున్న పంటల భవితవ్యంపై దేవుడిపై భారం వేస్తున్నారు. యాసంగి సీజన్‌న్‌లో జిల్లా వ్యాప్తంగా వరి 2,00,250 ఎకరాలు, మొక్కజొన్న 31,500 ఎకరాలు, వేరుశనగ 1,050 ఎకరాలు, మిర ప 230 ఎకరాలు, పొగాకు 250 ఎకరాలు, ఇతర పంటలు 500 ఎకరాలుగా వ్యవసాయాధికారులు నమోదు చేశారు. ముఖ్యంగా వరి పంట పెద్ద ఎత్తున సాగు చేయగా, వాతావరణ మార్పులు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఏప్రిల్‌ మొదటి వారం తర్వాత వరి కోతలు ప్రారంభం కానున్నాయి. కానీ దానికి ముందు జరిగే ఈ వాతావరణ మార్పులు ముఖ్యమైన దశలో పంటకు ముప్పుగా మారే అవకాశం ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉదయానికి మండే ఎండలతో పంట బాగా నిలబడుతుందని అనుకుంటే, మధ్యాహ్నానికల్లా మబ్బులు కమ్మేసి జల్లులు పడటం రైతుల ఆశలపై నీళ్లు చల్లే పరిస్థితిని తెచ్చిపెడుతోంది. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో వాతావరణంలో మార్పులు వస్తుండడంతో పంట నాణ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ కూడా పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది.

గడిచిన రెండున్నర దశాబ్దాలుగా ప్రతి యాసంగి సీజన్‌లో రైతులను వేధించే అకాల వర్షాలు, వడగల్లులు ఈసారి మరలా పునరావృతం కాకూడదని రైతులు భయపడుతున్నారు. వచ్చే 15 రోజులు ఎలా ఉంటాయన్న ఆందోళనతో పంటలను చుట్టూ తిరుగుతూ పరిస్థితిని గమనిస్తున్నారు. యాసంగి పంటలు చివరి దశలోకి చేరిన కీలక దశలో రైతులు వరుణుడిపై భారం వేసి వేడుకుంటున్నారు.

– కొంతం కుమారస్వామి, రైతు, తమ్మడపల్లి(జి)

పగలు ఎండలు..సాయంత్రానికి చీకట్లు

అన్నదాతల్లో వణుకు పుట్టిస్తున్న

వరణుడు

మార్చి, ఏప్రిల్‌లో వెంటాడుతున్న

అకాల వర్షాలు, వడగళ్లు

జిల్లాలో 2లక్షలకు పైగా పంటల సాగు

వాతావరణంలో మార్పులు, అకాల వర్షాల భయంతో కంటిమీద కునుకు లేకుండా పోతోంది. లక్షన్నర రూపాయల పెట్టుబడులు పెట్టి ఏడు ఎకరాల్లో వరి సాగు చేశాను. మరో 10 రోజులు గడిస్తే పంట చేతికందే దశలో ఉంది. కాయ కష్టం చేసి పంటను కాపాడుకుంటే తీరా చేతికందే దశలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటూ అకాల వర్షాల భయం నెలకొంది.

గోపరాజుల అనిల్‌, రైతు, కొడకండ్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement