రేపు అంగడి వేలం | - | Sakshi
Sakshi News home page

రేపు అంగడి వేలం

Mar 23 2026 8:44 AM | Updated on Mar 23 2026 8:44 AM

బచ్చన్నపేట: మండల కేంద్రంలోని వారాంతపు అంగడిలో పలు హక్కులకు బహిరంగ వేలం పాటలను ఈనెల 24న (మంగళవారం) నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్‌ అల్వాల నర్సింగారావు తెలిపారు. ఆదివారం గ్రామ పంచాయతీ ఈఓ అనిల్‌రాజ్‌తో కలిసి మాట్లాడారు. ఈ వేలం పాటల కాల వ్యవధి ఒక ఏడాది పాటు (2026–27 వరకు) ఉంటుందన్నారు. పశువుల రహదారి వేలానికి రూ. 60 వేల డిపాజిట్‌, తైబజారుకు రూ. 25 వేలు, డక్క ఫీజుల పాటకు రూ. 5వేల డిపాజిట్‌లను వేలం పాటలో పాల్గొనే వారు చేయాలన్నారు.

ఎన్‌జీఓల శిక్షణకు

జిల్లావాసి ఎంపిక

జనగామ: హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎన్‌జీఓల కోసం 3 రోజుల పాటు నిర్వహించనున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి జిల్లా కేంద్రానికి చెందిన స్వచ్ఛ సామాజిక సేవా ఫౌండేషన్‌ ప్రతినిధి కర్రె రాజు ఎంపికయ్యారు. నేటి(సోమవారం) నుంచి 25 వరకు మూడు రోజుల పాటు శిక్షణ నిర్వహించనున్నారు. లెర్నింగ్‌ ఫ్రం సక్సెస్‌ ఆడాప్టివ్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ ఎన్‌జీఓ పేరుతో జరగనున్న ఈ శిక్షణకు జిల్లాల రాజు పాల్గొననున్నారు.

భక్తిశ్రద్ధలతో ఎల్లమ్మ బోనాలు

జనగామ రూరల్‌: మండలంలోని ఎర్రకుంటతండాలో దుర్గమ్మ, రేణుక ఎల్లమ్మ, పోచమ్మ అమ్మవార్ల బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు దేవతలకు పూజలు నిర్వహించారు. సర్పంచ్‌ రమావత్‌ శ్రీకాంత్‌ ఏర్పాట్లు చేశారు.

సమస్యల పరిష్కారం కోసం విద్యుత్‌ గ్రీవెన్స్‌

జనగామ: వినియోగదారుల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపడంలో విద్యుత్‌ ప్రజావాణి కీలక పాత్ర పోషిస్తోందని ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా స్వీకరించి, వేగంగా పరిష్కరించడమే ప్రజావాణి కార్యక్రమం లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి సోమవారం క్రమం తప్పకుండా నిర్వహించే ఈ కార్యక్రమం, ఫీల్డ్‌ నుంచి సర్కిల్‌ స్థాయి వరకు అధికారులను వినియోగదారుల సమస్యలపై మరింత అప్రమత్తం చేస్తోందని తెలిపారు. జిల్లా సర్కిల్‌, డివిజన్‌, ఈఆర్‌ఓ సబ్‌డివిజన్‌, సెక్షన్‌ కార్యాలయాల్లో నేటి (సోమవారం)ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే గ్రీవెన్స్‌లో నమోదు చేసుకొని వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌ఈ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement