మేడారంలో తగ్గని రద్దీ
– వివరాలు IIలోu
● మహాజాతర ముగిసినా తరలివచ్చిన భక్తజనం
● కిక్కిరిసిన సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణం
కేసీఆర్‌పై సిట్ విచారణ సిగ్గుచేటు
జనగామ రూరల్: ఫోన్ ట్యాపింగ్ పేరుతో కేసీ ఆర్‌పై సిట్ విచారణ చేపట్టడం సిగ్గుచేటని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలువడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పార్టీ శ్రేణులతో కలసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నల్లబ్యాడ్జిలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకు నాయకత్వం వహించిన కేసీఆర్‌ను, తెలంగాణ ప్రజలను అవమానించేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. కేవలం రాజ కీయ కక్షతోనే సిట్ విచారణ పేరుతో కేసీఆర్‌ను ఇబ్బందులకు గురిచేయడం ఏమాత్రం సరికాదన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పా ల్పడుతున్నదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్తారన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు జి.నర్సింగరావు, పెద్ది రాజిరెడ్డి, బాల్దె సిద్దిలింగం, బండా పద్మ, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మాజీ ఎంపీపీ కలింగ రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
మేడారంలో తగ్గని రద్దీ


