విస్తృత చర్చలతోనే అభ్యర్థుల ఎంపిక
జనగామ రూరల్: విస్తృత చర్చలు, అభిప్రాయా లతోనే అభ్యర్థుల ఎంపిక జరిగిందని, పార్టీకి సేవ చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చామని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కార్యాలయంతో ఆయనతో పాటు జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి సమక్షంలో జనగామ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, పార్టీ విధానాలకు అనుగుణంగా, వార్డు అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, పట్టణ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపి, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి వెల్లడించారు.
వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలు: 1: మూడ్ లక్ష్మణ్ నాయక్, 2: రామగళ్ల విజయ్‌కుమార్, 4: మంత్రి సుమలత, 8: ఝెర్ర రజిని, 9:వంగాళ కళ్యాణి, 12: వంగా ఉమా, 13: మేడ శ్రీనివాస్, 14: తిరువైప్పడి ఆండాలు, 15: సిద్దం శివశంకర్, 16: కడకంచి సుశీలా 17: గొడేపాక రామచంద్ర 18: కొండ శ్రీనివాస్ రావు,19: దోర్నాల అనిత,20: గడారి రేణుక, 21: మోతే రేణుక, 24: వెమల్ల పద్మ, 26: జక్కుల వేణుమాధవ్, 27: చంచరపు కరుణాకర్ రెడ్డి, 28: రతియా బేగం, 29: మరుకుకుల శ్రీనివాసులు, 30: ఆరుట్ల రాంనర్సింహరెడ్డి.
ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీలకు ప్రాధాన్యం
కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన
ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి


