మిర్చికి మళ్లీ జీవం | - | Sakshi
Sakshi News home page

మిర్చికి మళ్లీ జీవం

Feb 2 2026 7:47 AM | Updated on Feb 2 2026 7:47 AM

మిర్చికి మళ్లీ జీవం

మిర్చికి మళ్లీ జీవం

లింగాలఘణపురం: ఈ ఏడాది మిర్చిపంట తీవ్రమైన తెగుళ్ల బారిన పడి దిగుబడి పూర్తిగా తగ్గి రైతులు నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మిర్చి ధర రోజురోజుకూ పెరుగుతుండడంతో రైతులు తెగుళ్లు సోకిన మిర్చి పంటకు మళ్లీ మందులు వేసి..కలుపు మొక్కలు తీసివేసేందుకు దున్నుతున్నారు. క్వింటాల్‌కు రూ.18వేల నుంచి రూ.20వేలపైకి చేరుతుండడంతో ఆకు అంతా రాలిపోయి చిగురిస్తుండగా మిర్చిపై మళ్లీ ఆశలు పెంచుకుంటున్నారు. మొక్కను తొలగించడం ఎందుకనే ఉద్దేశంతో ఎంతైనా కొంత దిగుబడి వస్తుందనే ఆశతో మళ్లీ అదే పంటకు జీవం పోయాలని చూస్తున్నారు. కొత్తపల్లికి చెందిన మేకల మల్లయ్య తనకు ఉన్న ఎకరంలో గత ఏడాది సుమారు 30 క్వింటాళ్ల మిర్చి దిగుబడి రాగా ఈసారి కేవలం ఆరేడు క్వింటాళ్లు మాత్రమే రావడంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో ఉన్నారు. చిగురిస్తున్న మిర్చి మొక్కలను మళ్లీ దున్ని మందులు వేసి నీళ్లు పెడితే ఎంతో కొంత దిగుబడి వస్తుందని ఆశతో దున్నుతున్నాడు. ఇదే విధంగా మండలంలో మిర్చి వేసిన రైతులు కొంత మంది అదే ఆశతో ఉన్నారు.

తెగుళ్ల బారిన పడిన పంటకు

మందులు, కలుపుతీత

‘ఎర్రబంగారం’

ధర పెరుగుతుండడంతో రైతుల ఆశలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement