నేటి నుంచి క్రితి 2.0
● కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య
ఎంజీఎం: కాకతీయ మెడికల్ కళాశాలలో ఈ నెల 8, 9 తేదీల్లో క్రితి 3.0 (కాకతీయ రిసెర్చ్ ఇన్షియేటివ్ ఫర్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇనోవేషన్స్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, కేఎంసీ ఎన్‌ఆర్‌ఐ సభ్యులు డాక్టర్ వేణు బత్తిని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థుల్లో పరిశోధన, నవీన ఆలోచనలు ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. బుధవారం కళాశాలలో వారు మాట్లాడుతూ.. ఈ ఏడాది నిర్వహిస్తున్న క్రితిలో దేశవ్యాప్తంగా వివిధ వైద్య కళాశాలల నుంచి 1100కుపైగా విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు.


