సీజేఐటీలో ఐసీటీ అకాడమీ ప్రోగ్రాం | - | Sakshi
Sakshi News home page

సీజేఐటీలో ఐసీటీ అకాడమీ ప్రోగ్రాం

Jan 8 2026 7:12 AM | Updated on Jan 8 2026 7:12 AM

సీజేఐ

సీజేఐటీలో ఐసీటీ అకాడమీ ప్రోగ్రాం

సోమన్న ఆలయానికి టెండర్ల ఆదాయం రూ.3,38,000 పుణె సదస్సుకు బచ్చన్నపేట సర్పంచ్‌ ఎంపిక

జనగామ: మండలంలోని యశ్వంతాపూర్‌ క్రీస్తుజోతి ఇంజనీరింగ్‌ కళాశాలలో బుధవారం ఐబీఎం ప్రోత్సాహంతో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ డేటా ఎనలిటిక్స్‌ సీఎస్‌ఆర్‌ ప్రోగ్రాం నిర్వహించారు. కళాశాల డైరెక్టర్‌ విజయపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మల్లికార్జున్‌ అప్పని, ఎండీ జీవన్‌, ఫారూఖ్‌ నేతృత్వంలో 65 మంది విద్యార్థులకు ఏఐపై తర్ఫీదు ఇస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులు మరింత విజ్ఞానం, కోర్సులో మెరుగులు దిద్దుకునే అవకాశం ఉంటుందని డైరెక్టర్‌ తెలిపారు. 9వ తేదీతో శిక్షణ పూర్తవుతుందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రగుప్త ఆలయానికి రూ.2లక్షల విరాళం

జనగామ: పట్టణానికి చెందిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ సర్‌ సేవా సమితి చైర్మన్‌ కొత్తపల్లి సతీశ్‌ కుమార్‌ చంద్రాయణగుట్ట చిత్రగుప్త దేవాలయానికి రూ.2,00,116 విరాళంగా అందించారు. బుధవారం కుటుంబ సమేతంగా ఆలయంలో దేవతామూర్తులను దర్శించుకున్నా రు. అనంతరం దేవాలయ అధికారులు, పూజా రులు సతీశ్‌ కుమార్‌ దంపతులకు ఆశీర్వచనం అందించారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయానికి ధ్వజస్తంభం నిర్మణానికి తనవంతు సహకారం అందించినట్లు సతీష్‌ తెలిపారు.

పాలకుర్తి టౌన్‌: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో అభిషేకం పూజసామగ్రి సప్లై చేసేందుకు వేసిన టెండర్‌ డ్రా ద్వారా రూ.3,38,000ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న తెలిపారు. బుధవారం ఆలయంలోని కల్యాణ మండపంలో సీల్డ్‌ టెండర్‌ డ్రా ద్వారా నిర్వహించారు. ఆలయంలో అభిషేకం పూజసామగ్రి సప్లై చేసేందుకు 38 మంది షెడ్యూల్‌ కొనుగోలు చేయగా నల్లగొండ దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిసెంట్‌ కమిషనర్‌ కె.భాస్కర్‌ డ్రా తీశారు. పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన సింగ శ్రీలత అభిషేకం సామగ్రి సప్లై చేసేందుకు డ్రాలో ఎంపికయ్యారు. ఎంపీడీఓ వి.వేదావతి, సర్పంచ్‌ కమ్మగాని విజయ, ఆలయ సూపరింటెండెంట్‌ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ అర్చకులు, సిబ్బంది, టెండర్‌దారులు పాల్గొన్నారు.

బచ్చన్నపేట: జిల్లాలోని బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన గ్రామ సర్పంచ్‌ అల్వాల నర్సింగరావు పుణె సదస్సుకు ఎంపికయ్యారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. పుణెలో జరిగే మోడల్‌ ఉమెన్‌ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ జాతీయ శిక్షణకు ఎంపిక చేసినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో 8 మంది సర్పంచ్‌లు, 4గురు ఎంపీడీఓలు, 3 పంచాయతీ కార్యదర్శులను ఎంపిక చేసినట్లు తెలిపారు. అందులో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తనతోపాటు మరో ఇద్దరు సర్పంచ్‌లను ఎంపిక చేశారన్నారు. శిక్షణ ఈ నెల 8, 9న ఉంటుందన్నారు. గ్రామ పంచాయ తీ నిర్మాణం, పాలనలో మహిళా భాగస్వామ్యం, నూతన నమూనా, గ్రామ నిర్వహణ విషయాలపై శిక్షణ పొందనున్నామని తెలిపారు.

జాతీయస్థాయి పోటీలకు మోడల్‌ స్కూల్‌ విద్యార్థి

జఫర్‌గఢ్‌ : మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌కు చెందిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థి డి.రితిక జాతీయస్థాయి షూటింగ్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ కె.శ్రీకాంత్‌ తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల పర్వతగిరి మండలంలోని పల్లవి స్కూల్‌లో జరిగిన 44వ రాష్ట్ర స్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీల్లో రితిక ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లాలో 44వ జాతీయ స్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీల్లో పాల్గొనున్నట్లు తెలిపారు.

సీజేఐటీలో ఐసీటీ అకాడమీ ప్రోగ్రాం1
1/3

సీజేఐటీలో ఐసీటీ అకాడమీ ప్రోగ్రాం

సీజేఐటీలో ఐసీటీ అకాడమీ ప్రోగ్రాం2
2/3

సీజేఐటీలో ఐసీటీ అకాడమీ ప్రోగ్రాం

సీజేఐటీలో ఐసీటీ అకాడమీ ప్రోగ్రాం3
3/3

సీజేఐటీలో ఐసీటీ అకాడమీ ప్రోగ్రాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement