నేడు చుక్కా సత్తయ్య వర్ధంతి
లింగాలఘణపురం: మండలంలోని మాణిక్యాపురంకు చెందిన ఒగ్గు కథ పితామహుడు డాక్టర్ చుక్కా సత్తయ్య 8వ వర్థంతి నేడు (ఆదివారం) నిర్వహించనున్నారు. జానపద కళారూపమైన ఒగ్గు కథకు ఆయన ప్రాణం పోశాడు. తండ్రి ఆగయ్య నుంచి నేర్చుకొని 14 ఏళ్లకే ఒగ్గుకథ చెప్పడం ప్రారంభించి దేశ విదేశాల్లో 12,000 ప్రదర్శనలు ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో పాటు అనేక మందితో అవార్డులు అందుకొని కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చేతుల మీదుగా తీసుకున్నారు. ఒగ్గుకథకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన గొప్ప కళాకారుడు చుక్క సత్తయ్య.
నేడు విగ్రహ ప్రతిష్ఠాపన
జనగామ: ఒగ్గుకళా సామ్రాట్, కేంద్ర సంగీత నాట క అకాడమీ పురస్కార గ్రహీత సత్తయ్య 8వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రం కళ్లెం రోడ్డులో నేడు(ఆదివారం) విగ్రహం ప్రతిష్ఠించనున్నట్లు జిల్లా ఒగ్గుబీర్ల కళాకారుల సంక్షేమ సంఘం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఒగ్గుబీర్ల పూజారులు, కళాకారులు, అన్ని వర్గాల వారు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.


