బాలికల సంరక్షణకు చట్టాలు దోహదం
● లీగల్ అడ్వయిజర్ జి.దయామణి
దేవరుప్పుల: బాలికల హక్కుల సంరక్షణకు చట్టాలు దోహదపడుతాయని జనగామ కోర్టు లీగల్ అడ్వయిజర్ జి.దయామణి సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో జిల్లా న్యాయసేవాధికారి సంస్థ, భరోసా ఆధ్వర్యంలో లీగల్ సర్వీస్‌డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీనేజ్ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు వివరిస్తూ పరిష్కార మార్గాలను సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ జి.కళావతి, భరోసా రిసోర్స్ పర్సన్ బి.స్వాతి, పీఎల్‌వీ శేఖర్, డీఎల్‌ఎస్ సూపరింటెండెంట్ సీతారామరాజు, గురుకుల ప్రత్యేకాధికారి సుకన్య, ఏఎస్సై సదానందం, కానిస్టేబుళ్లు సమత, యాకేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


