జోనల్ చాంపియన్ ఘన్‌పూర్
స్టేషన్‌ఘన్‌పూర్: ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో జరిగిన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల జోనల్ స్థాయి క్రీడాపోటీల్లో స్టేషన్‌ఘన్‌పూర్ సోషల్ వెల్ఫేర్ పాఠశాల, కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభతో అండర్ 14, 17, 19 విభాగాల్లో ఓవరాల్ చాంపియన్లుగా నిలిచారని ప్రిన్సిపాల్ బి.రఘుపతి, క్రీడల సమన్వయకర్త, పీడీ జి.శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు క్రీడాపోటీల్లో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి ఓవరాల్ చాంపియన్లుగా నిలిచిన విద్యార్థులను స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అండర్ 14 విభాగంలో ఖోఖో, టెన్నికాయిట్‌లో ప్రథమస్థానంలో, అండర్ 17 విభాగంలో టెన్నికాయిట్‌లో ప్రథమ, హ్యాండ్‌బాల్, ఖోఖోలో ద్వితీయ స్థానం, అండర్ 19లో చెస్, టెన్నికాయిట్‌లో ప్రథమ, హ్యాండ్‌బాల్‌లో ద్వితీయ స్థానం సాధించారన్నారు. అథ్లెటిక్స్‌లో 19 ఇయర్స్ విభాగంలో సీహెచ్.పవన్ 100మీ, 200మీ, 400 మీటర్ల పరుగు పందెంలో ప్రథమస్థానం, ఎల్.చరణ్ 1500 మీటర్లు, 5000 మీటర్ల పరుగుపందెంలో ద్వితీయ స్థానం, అండర్ 17లో కె.విఘ్నేష్ 800మీ, 1500 మీటర్ల పరుగుపందెంలో ద్వితీయ, ఎం.మహేశ్ 100, 200, 400 మీటర్ల పరుగుపందెంలో ద్వితీయస్థానంలో నిలువగా అరవింద్ షాట్‌ఫుట్, డిస్కస్‌త్రోలలో ద్వితీయ స్థానంలో నిలిచారన్నారు. అదేవిధంగా అండర్ 14లో వెంకటదుర్గ 200, 400 మీటర్ల పరుగుపందెంలో ద్వితీయ, భానుతేజ డిస్కస్‌త్రోలో ద్వితీయ, జీవన్ షాట్‌ఫుట్‌లో ద్వితీయ స్థానంలో నిలిచారన్నారు. పీఈటీ లక్ష్మన్, కోచ్ ప్రవీణ్, కళాశాల సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ రవీందర్, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ జయేందర్ పాల్గొన్నారు.
సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాల పోటీల్లో మన విద్యార్థుల సత్తా


