
బీసీ బంద్ ప్రశాంతం
42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం
జనగామ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బీసీ బంద్ శనివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, సంఘాలు, విద్యార్థి సంఘాలు కలిసి బంద్‌కు మద్దతు తెలిపారు. పట్టణంలోని వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసి వేయగా, ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. రాజకీయ పార్టీలు, జేఏసీ, విద్యార్థి, బీసీ సంఘాల ఆధ్వర్యంలో వివిధ పార్టీ నాయకులు భారీ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆర్టీసీ చౌరస్తాలో కార్యకర్తలు రాస్తారోకో చేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నినదించారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణ లో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణ రెడ్డి, పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు చర్యలు చేపట్టారు. పట్టణంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో గులాబీ శ్రేణులు, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సర్దుకుంది. అ నంతరం అన్ని రాజకీయ పార్టీలు కలిసి బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఆర్టీసీ చౌరస్తాలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
బీసీ జేఏసీ ఆధ్వర్యంలో..
జిల్లాలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ విజయవంతంగా జరిగింది. ఉదయం 5 గంటలకు ఆర్టీసీ డిపోకు వెళ్లి బస్సులు బయటకు వెళ్లకుండా గేటుకు తాళం వేశారు. అనంతరం ద్విచక్ర వాహనాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అన్ని సంఘాలకు జేఏసీ నాయకుడు మంగళంపల్లి రాజు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్రంలో బీసీలకు ద్రోహం చేస్తున్న బీజేపీ పార్టీని ప్రజలు భూ స్థాపితం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పిలుపునిచ్చారు. బంద్‌లో భాగంగా రైల్వేస్టేషన్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో..
42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలిపి గవర్నర్ కి పంపించినప్పటికీ, జాప్యం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు అఖిల పక్ష నాయకులతో కలిసి ఆ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ, చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, నాయకులు చెంచారపు బుచ్చిరెడ్డి, రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బంద్ కు మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆధ్వర్యంలో పట్టణంలో భా రీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మార్కె ట్ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, బీసీ కన్వీన ర్ సేవెల్లి సంపత్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు, ఇన్‌చార్జ్ బోడ సునీల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఆర్టీసీ బీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో..
ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు లింగం, రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం నాయకుడు దుర్గయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
– మరిన్ని ఫొటోలు 11లోu
వివిధ మండలాల్లో బంద్ ఇలా..
స్టేషన్‌ఘన్‌పూర్‌లో బీసీ జేఏసీ, బీసీ సంక్షేమ సంఘం, అన్ని పార్టీల నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో, ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు.
దేవరుప్పుల మండల కేంద్రంలోని జనగామ, సూర్యాపేట రహదారిపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ, ఎమ్మార్పీఎస్, బీఎస్‌పీ తదితర పార్టీల ప్రతినిధులు రాస్తారోకో చేశారు.
పాలకుర్తిలో బంద్ నేపధ్యంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సీపీఎం, బీజేపీ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకులు రాజీవ్ చౌరస్తాలో నిరసన, బైక్‌ర్యాలీ నిర్వహించారు.
బీసీబంద్‌కు బచ్చన్నపేట, నర్మెట, కొడకండ్ల, తరిగొ ప్పుల మండలాల్లోని అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి.
రఘునాథపల్లి, చిల్పూరు, జఫర్‌గఢ్, లింగాలఘణపురం,కొడకండ్ల మండలాల్లో బీసీ బంద్ విజయవంతమైంది.
ఆర్టీసీ డిపోకు తాళం..ఆగిన చక్రాలు
రోడ్డెక్కిన అన్ని రాజకీయ పార్టీలు,
బీసీ సంఘాలు
జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు, రాస్తారోకోలు
డీసీపీ, ఏఎస్పీ ఆధ్వర్యంలో నిఘా

బీసీ బంద్ ప్రశాంతం

బీసీ బంద్ ప్రశాంతం

బీసీ బంద్ ప్రశాంతం