
ముగిసిన మద్యం టెండర్లు
● జిల్లాలో 1,528 దరఖాస్తులు
● దరఖాస్తులు తగ్గినా..ఆదాయం పెరిగింది
జనగామ: జిల్లాలో ఎకై ్సజ్ టెండర్లు శనివారం రాత్రితో ముగిశాయి. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గినప్పటికీ ఆదాయం పెరిగింది. 2023–25 నవంబర్ 30 రెండేళ్ల సీజన్‌కు గాను 2,492 టెండర్లు రాగా, 2025–27 సీజన్‌కు సంబంధించి శనివారం రాత్రి 10 గంటల వరకు 1,528 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అయితే అర్ధరాత్రి 12 గంటల వరకు మరో 150 దరఖాస్తులు పెరిగే అవకాశం ఉన్నట్లు ఎకై ్సజ్ అధికారులు భావిస్తున్నారు. గతేడాది టెండర్ల ద్వారా సుమారు రూ.50 కోట్ల మేర (నాన్ రిఫండబుల్) ఫీజుల రూపంలో ఆదాయం లభించింది. ఈసారి ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచడంతో దరఖాస్తులు ఒక్కసారిగా తగ్గాయి. దీంతో ఆదాయం మాత్రం ఎకై ్సజ్ శాఖ ఆశించిన మేర సమాన స్థాయిలో నిలిచింది. జిల్లాలో మొత్తం 50 వైన్ షాపులకు గాను టెండర్ ప్రక్రియ కొనసాగింది. రాత్రి వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతూనే ఉంది. దరఖాస్తు ఫీజు పెంచడంతో చాలా మంది వ్యా పారులు, ఉత్సాహవంతులు వెనక్కి తగ్గడంతో టెండర్ల సంఖ్య పెరగనప్పటికీ, ఆదాయంలో మునుపటి లెక్కకు సరిపోతుందని అధికారులు సంతోషంలో ఉన్నారు. దీంతో ఎకై ్సజ్ శాఖ ఖజానా ‘ఫుల్’ జోష్‌లో ఉంది. కాగా జనగామ సర్కిల్‌లో 20 మద్యం దుకాణాలకు 502, స్టేషన్‌ఘన్‌పూర్ పరిధిలో 16 వైన్స్‌లకు 515, పాలకుర్తిలో 14 దుకాణాలకు 511 టెండర్లు వచ్చాయి.

ముగిసిన మద్యం టెండర్లు