
జీడికల్ హుండీ ఆదాయం రూ.4.18లక్షలు
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి దేవాలయ ఆదాయం రూ.4,18,993లు వచ్చినట్లు ఈఓ వంశీ తెలిపారు. హుండీలో లెక్కింపులో రూ.1,20,993లు కాగా ఆలయ ప్రాంగణంలో లడ్డు, పులిహోర విక్రయానికి గాను వేలం నిర్వహించగా రూ.2,98,000 వచ్చినట్లు తెలిపారు. హుండీ లెక్కింపు దేవాదాయ శాఖ భువనగిరి డివిజన్ ఇన్‌స్పెక్టర్ నిఖిల్ పర్యవేక్షణలో లెక్కించారు. లడ్డు, పులిహోర విక్రయానికి వేలం నిర్వహించగా పొనగంటి సురేశ్ రూ.2,98,000లకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్ మూర్తి, డైరెక్టర్లు శ్రీశైలం, వెంకన్న, సంపత్, వెంకటేశ్, ఆలయ సిబ్బంది భరత్, కొడవటూరు దేవస్థాన జూనియర్ అసిస్టెంట్ బాను, సిబ్బంది మల్లేశం, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై
దృష్టి సారించాలి
జనగామ: మెడికల్ ఆఫీసర్లు డెంగీ, సీజనల్ వ్యాధులపై దృష్టి సారించి లార్వా, పెద్ద దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌ఓ కె.మల్లికార్జున్‌రావు ఆదేశించారు. జనగామ పట్టణంలోని యూపీహెచ్‌సీని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. యూపీఐ సెషన్‌ను పర్యవేక్షించి, లబ్ధిదారుల తల్లిదండ్రులతో మాట్లాడి, షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఔట్ పేషంట్లతో మాట్లాడి అందిస్తున్న సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్స్ కమల్, వైద్యాధికారిని అనురాధ, డీవైడీఈఎంఓ ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
డీఎంఓగా బాధ్యతల స్వీకరణ
జనగామ: జనగామ మార్కెటింగ్ ఆఫీసర్ (డీఎంఓ)గా నరేంద్ర శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయన బదిలీ కాగా, తిరిగి యథాస్థానికి వచ్చారు. కాగా కలెక్టర్ రిజ్వాన్ బాషాను నరేంద్ర మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు, త్వరలో పత్తి కొనుగోళ్లు తదితర వాటికి సంబంధించి దృష్టి సారించనున్నట్లు ఆయన తెలిపారు.
అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం
హన్మకొండ: తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను తెలిపారు. నవంబర్ 5న జరిగే గిరి ప్రదక్షిణకు అదే నెల 3న హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్ నుంచి బయలుదేరుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చార్జీ పెద్దలకు రూ.5 వేలు, పిల్లలకు రూ.3,500గా నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలోనూ టికెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ టూర్ ప్యాకేజీ పూర్తి సమాచారం కోసం 90634 07493, 77805 65971, 98663 73825, 99592 26047 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.
రూ.1.50 కోట్ల ఆదాయం కోల్పోయిన ఆర్టీసీ
బీసీ బంద్‌తో ఆర్టీసీకి నష్టం జరిగింది. బస్సులన్నీ మధ్యాహ్నం వరకు డిపోలోనే ఉండిపోవడంతో ఒక్క రోజులో రూ.1.50 కోట్ల ఆదాయం కోల్పోయింది. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో 950 బస్సులు ప్రతీరోజు 4 లక్షల కిలో మీటర్లు తిరిగి సగటున రూ.2.30 కోట్ల ఆదాయం వస్తుంది. మధ్యాహ్నం తర్వాత బస్సులు తిరిగినా ప్రయాణికుల సంఖ్య తగ్గింది. దీపావళి పండుగ సెలవులు రావడంతో సొంతూళ్లకు వెళ్లాలని బస్ స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. అధిక చార్జీలు చె ల్లించి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.

జీడికల్ హుండీ ఆదాయం రూ.4.18లక్షలు

జీడికల్ హుండీ ఆదాయం రూ.4.18లక్షలు

జీడికల్ హుండీ ఆదాయం రూ.4.18లక్షలు