
నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టొద్దు
● సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
జనగామరూరల్: నిబంధనల పేరుతో అధికారులు, రైస్ మిల్లర్స్ రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా వ్యవసాయ మార్కెట్‌లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పార్టీ బృందంతో శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో పాటు అధిక వర్షాలతో పంట దిగుబడి తక్కువగా వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బొట్ల శేఖర్, బోడ నరేందర్, భూక్య చందునాయక్, నాయకులు మంగ బీరయ్య, నాగరాజు, అజ్మీర సురేష్‌నాయక్, బీదని శ్రీను, సిలువేరు ఉపేందర్, బిర్రు విష్ణు, రామచంద్రం, కనకచారితో పాటు రైతులు పాల్గొన్నారు.