
మూత ఎట్ల తీయల్నో!
కోతికి మందు బాటిల్ దొరికింది..అందులో ఏముందో..దాని మూత ఎట్ల తీయల్నో తెలియక కిందామీదా పడింది. గురువారం జనగామ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఓ వ్యక్తి బైక్‌లో మద్యం బాటిల్ ఉండగా..దాన్ని వానరం దొరకపట్టుకుంది. బాటిల్‌ను కౌగిలించుకుంటూ.. దాన్ని ఓపెన్ చేయడానికి విఫలయత్నం చేసింది. ఆ వైపుగా కోతిచేష్టలను చూస్తున్న బైక్ యజమాని మాత్రం బాటిల్ ఎక్కడ పగులుతుందోనని ఆందోళన చెందాడు. చివరకు వానరం మద్యం బాటిల్‌ను అక్కడే వదిలేసి చెట్ట్టెక్కి కూర్చుంది. దీంతో బైక్ యజమాని బాటిల్ సేఫ్.. అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
–జనగామ