జనగామ: జిల్లా కేంద్రంలో హన్మకొండ రోడ్డులోని సాంఘిక గురుకులంలో ఈ నెల 20వ తేదీన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా పరిధిలో 19 సంవత్సరాల కళాశాల బాలుర ఫుట్‌బాల్ క్రీడాపోటీల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని క్రీడల కన్వీనర్, పీడీ అజ్మీరా కిషన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతీ కళాశాల నుంచి ఐదుగురు క్రీడాకారులు మాత్రమే పాల్గొనాలన్నారు. ఇందులో ఎంపికై న క్రీడాకారులు ఈ నెలచివరి వారంలో రాష్ట్ర స్థాయిలో జరిగే ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. 20వ తేదీన ఉదయం 10 గంటలలోపు ఒరిజినల్ 10వ తరగతి మెమో, సాంఘిక గురుకులంలో ఉండాల ని, ఒరిజినల్ ఆధార్ కార్డుతో అందుబాటులో ఉండి, పేర్లను నమోదుచేసుకోవాలన్నారు. మ రిన్ని వివరాల కోసం 83749 10159, 98490 59284 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
సీపీఐ ఆల్‌ఇండియా మహాసభ ప్రతినిధుల ఎంపిక
జనగామ రూరల్: పంజాబ్ రాష్ట్ర రాజధాని చండీగర్‌లో ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు సీపీఐ అఖిలభారత 24వ మహాసభ ప్రతినిధులుగా జిల్లా నుంచి పార్టీ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి, సహాయ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఈసందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి వారు కృతజ్ఞత తెలిపారు. దేశంలో జరుగుతున్న రాజకీయ అస్థిర పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీల అవసరం, ప్రాధాన్యం గురించి ప్రజల్లో ఏదైతే చర్చించుకుంటున్నారో దానికి అనుకూలంగా మహాసభలో చర్చిస్తామని రాజారెడ్డి చెప్పారు.
జనగామ: జనగామ సబ్‌కోర్టు అడిషినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా(ఏపీపీ) పట్టణానికి చెందిన బండ శ్రీనివాస్ నియమితులయ్యారు. హైదరాబాద్ ఆర్‌ఆర్‌ఆర్ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన ఆయన, 2011 నుంచి న్యాయవాది వృత్తిలో ప్రాక్టీసు చేస్తున్నారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, యశస్వినీరెడ్డి, సీఎం సలహాదారులు వేం నరేందర్‌రెడ్డికి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ కవులపై
వ్యాసరచన పోటీలు
జనగామ రూరల్: రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ఆధ్వర్యంలో హైస్కూల్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిరికొండ కుమారస్వామి, శ్రీనివాసాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని కవులు బమ్మెర పోతన, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు, సుద్దాల హనుమంతు, వట్టికోట ఆళ్వార్‌స్వామి, వానమామలై వరదాచార్యులు, సురవరం ప్రతాపరెడ్డి, పాకాల యశోదారెడ్డి, బోయ జంగయ్య, సి.నారాయణరెడ్డి వంటి కవులపై జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలు ఉంటాయన్నారు. జిల్లాస్థాయిలో ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపిస్తామన్నారు. అక్టోబర్ 6వ తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేసుకొని వ్యాసాలను జిల్లా స్థాయికి పంపించాలని తెలియజేశారు. ఆసక్తి గల వారు 99897 24110 ఫోన్ నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
యూరియా పంపిణీ పరిశీలన
స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్‌పూర్ డివిజన్‌కేంద్రంలో గురువారం యూరియా బస్తాల పంపిణీని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ సమీపంలో ఉన్న హాకా సెంటర్‌ను, హాకా గోదాంను ఆయన సందర్శించారు. సెంటర్‌లో ఉన్న యూరియా బస్తాలను పరిశీలించారు. అనంతరం హాకా సెంటర్ నిర్వాహకులతో, వ్యవసాయ అధికారులతో మాట్లాడుతూ రైతులకు సక్రమంగా యూరియా పంపిణీ చేయాలని సూచించారు. ఆయన వెంట ఏసీపీ భీమ్‌శర్మ, సీఐ జి.వేణు తదితరులు ఉన్నారు.
రేపు ఎస్‌జీఎఫ్‌ఐ ఉమ్మడి జిల్లా ఫుట్‌బాల్ పోటీల ఎంపిక
రేపు ఎస్‌జీఎఫ్‌ఐ ఉమ్మడి జిల్లా ఫుట్‌బాల్ పోటీల ఎంపిక