
క్రిస్టియన్ల అభివృద్ధికి చర్యలు
జనగామ రూరల్: క్రిస్టియన్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొంటోందని రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కొక్కడన్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో క్రిస్టియన్ ప్రజల సమస్యలపై జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్‌లతో కలిసి పాస్టర్లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ దీపక్ జాన్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేద క్రిస్టియన్ సోదరులకు అందే విధంగా ప్రతీ ఆదివారం చర్చిలలో తెలియజేయాలని సూచించారు. పాస్టర్లు కోరిన విధంగా ప్రధాన సమస్యలపై దృష్టిపెట్టి ముందుగా ప్రతీ నియోజకవర్గంలో శ్మశాన వాటిక, కమ్యూనిటీ హల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. చర్చి నిర్మాణాలకు అనుమతులు, కుల ధ్రువీకరణ పత్రాల మంజూరుకు ప్రభుత్వ నిబంధనల మేరకు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో జనాభా లెక్కల ప్రకారం సుమారు 6వేలు క్రిస్టియన్లు ఉన్నారన్నారు. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి నియోజక వర్గాలలో బరియల్ గ్రౌండ్‌కు చర్యలు తీసుకుంటామని, మున్సిపాలిటీలలో కమ్యూనిటీ హాల్స్ కేటాయించామని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమాధికారి బి.విక్రమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్
కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కొక్కడన్