
జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు
● రైతులు ఆందోళన చెందవద్దు
● డీఏఓ అంబికా సోని
జనగామ: జిల్లాలో వానాకాలం సీజన్‌లో పంటలకు సరిపడా యూరి యా ఉందని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయాధికారి అంబికా సోని అన్నారు. గురువారం ఆమె మా ట్లాడుతూ.. జిల్లాలోని 403.26 టన్నుల యూరియా సహకార సంఘాలు, ప్రైవేట్ కేంద్రాల వద్ద ఉందన్నారు. బచ్చన్నపేటలో 41.40 మెట్రిక్ టన్నులు, చిల్పూర్‌లో 48.98, దేవరుప్పులలో 20.00, స్టేషన్ ఘనపూర్‌లో 25.00, జనగామలో 44.00, కొడకండ్లలో 15.00, లింగాలఘణపురంలో 37.00, నర్మెటలో 27.88, పాలకుర్తిలో 25.00, రఘునాథపల్లిలో 56.00, తరిగొప్పులలో 28.00, జఫర్‌గడ్‌లో 35 టన్నుల నిల్వలు ఉన్నట్లు, సీజన్‌లో ఎలాంటి కొరత లేకుండా చూస్తున్నామన్నారు. యూరియా వినియోగం ఎక్కువగా వరి పంటలోనే ఉంటుందన్నారు. జిల్లాలోని గ్రామాల వారీగా కేటాయించిన కేంద్రాల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నామని, పంట దశను బట్టి రెండో లేదా మూడో మోతాదులో చల్లుకుని పంట ఉత్పత్తి పెరిగేలా చూసుకోవాలని డీఏఓ తెలిపారు.