
‘వేటా’ బతుకమ్మ వేడుకలకు ఆహ్వానం
దేవరుప్పుల: అమెరికా కాలిఫోర్నియాలో వెటా ఆధ్వర్యంలో తలపెట్టిన బతుకమ్మ వేడుకలకు రాష్ట్రమంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి సీతక్కకు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, వేటా వ్యవస్థాపక అధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి గురువారం హైదరాబాద్‌లో కలిసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా అమెరికాలో కాలిఫోర్నియా విమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా) వ్యవస్థాపక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న ఝాన్సీరెడ్డితోపాటు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగను విదేశాల్లోనూ వేటా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని, బతుకమ్మ వైభవాన్ని చాటుతామని తెలిపారు. వారితో పాటు భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఉన్నారు.