
నిద్రాహారాలు అక్కడే..
● యూరియా కోసం అర్ధరాత్రి నుంచి క్యూలో రైతులు
● సొసైటీ గోదాం వద్దే నిద్ర, భోజనం
పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం సొసైటీ గోదాం వద్ద అర్ధరాత్రి నుంచి రైతులు క్యూలో ఉంటున్నారు. టోకెన్ల కోసం క్యూలైన్‌లో చెప్పులు, రాళ్లు పెట్టి అక్కడే నిద్రపోతున్నారు. తెల్లవారుజామున అక్కడికే భోజనం తెప్పించుకుని తింటున్నారు. గురువారం 244 బస్తాల యూరియా రాగా 800 మంది రైతులు బారులు తీరురారు. చివరికీ ఒక్క రైతుకు ఒక్క బస్తా చొప్పున 244 మందికి యూరియా అందజేశారు. మిగిలిన రైతులకు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తీసుకొని పేర్లు నమోదు చేసుకున్నారు. వారికి మరో దఫా అందించనున్నారు.

నిద్రాహారాలు అక్కడే..

నిద్రాహారాలు అక్కడే..