
త్యాగఫలం!
సంక్షేమం ఇలా..
పోరాటయోధుల
వేడుకలకు హాజరైన నాయకులు, ప్రజలు, అధికారులు
జాతీయ జెండాను ఎగురవేసి, సెల్యూట్ చేస్తున్న విప్ అయిలయ్య
జనగామ: ఎందరో పోరాట యోధుల బలిదానంతోనే మనమంతా స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటున్నామని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. జనగామ కలెక్టరేట్ ప్రాంగణంలో బుధవారం జరిగిన ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ విప్ అయిలయ్యకు ఘన స్వాగతం పలికారు. ముందుగా బీర్ల అయిలయ్య అమర వీరుల స్థూపానికి నివాళులర్పించి, జాతీయ జెండా ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల విధ్వంసం తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనతో స్వేచ్ఛగా బతుకుతున్నామన్నారు. నిజాం పాలన నుంచి విముక్తి పొంది 78వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామన్నారు. సంక్షేమంతో పాటు తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేస్తూ కోటీశ్వరులను చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కంకణబద్ధులై పనిచేస్తున్నారన్నారు.
విద్యలో ఆదర్శం..
జాతీయ స్థాయిలో జరిగిన న్యాస్‌లో మొదటి 50 జిల్లాల జాబితాలో జనగామ జిల్లాకు ఉత్తమ చోటు దక్కగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్‌వన్‌గా నిలిచి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం పుర స్కరించుకుని హైదరాబాద్ శిల్పకళా వేదికలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డులను అందుకోవడం జిల్లాకే గర్వకారణమన్నారు. అలాగే విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రత్యేక చొరవ తీసుకుని దిక్సూచి అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సుహాసిని, జెడ్పీ సీఈవో మాధురీ షా, ఆర్డీవో గోపీరామ్, తహసీల్దార్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని అందించే మహాలక్ష్మి పథకంతో జిల్లాలో ఇప్పటివరకు రూ.2కోట్ల47లక్షల విలువైన ప్రయాణఖర్చు ఆదా కాగా, దీనిని ప్రభుత్వమే భరించిందని ప్రభుత్వ విప్ తెలిపారు. నిరుపేదలకు సొంత ఇంటికలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 55, 998ఇళ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. న్యాస్‌లో జనగామ జిల్లా జాతీయ స్థాయిలో ఉత్తమంగా నిలువడం అభినందనీయమన్నారు. గృహజ్యోతి స్కీం ద్వారా జిల్లాలో 14లక్షల59వేల470 జీరో బిల్లులు జారీ చేయగా, 92వేల774 కుటుంబాలు రూ.42 కోట్ల జీరో బిల్లులు ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ పదేళ్ల సంక్షోభం తర్వాత రాష్ట్రంలో ప్రజాపాలన
ఆడపడుచులను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్ లక్ష్యం
ప్రజాపాలన వేడుకల్లో
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా వేడుకలు

త్యాగఫలం!

త్యాగఫలం!

త్యాగఫలం!