
కృత్రిమమేధ.. కీలకపాత్ర
విద్యారణ్యపురి : వ్యవసాయం, ఫార్మా, వ్యాపార, వాణిజ్య తదితర రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) కీలకపాత్ర పోషిస్తోందని కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్ తెలిపారు. బుధవారం హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీఅండ్ పీజీ కళాశాలలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీ షేపింగ్ ది లాండ్‌స్కేప్ ఆఫ్ కామర్స్‌అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో రాజేందర్ పాల్గొని మాట్లాడారు. ఈ సదస్సులో హైదరాబాద్ ఎంజెల్స్ సీఈఓ, ఇన్వెస్ట్‌మెంట్ డైరెక్టర్ రత్నాకర్ సామవేదం కీలక ఉపన్యాసం చేశారు. అనంతరం అతిథులు సావనీర్‌ను ఆవిష్కరించారు. పలువురు పరిశోధన పత్రాలు సమర్పించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, సదస్సు కన్వీనర్ డాక్టర్ రాజిరెడ్డి, కేయూ ప్రొఫెసర్ పి.అమరవేణి, కామర్స్ విభాగం అధిపతి డాక్టర్ సారంగపాణి, హుస్నాబాద్ కాలేజీ ప్రిన్సిపాల్ భిక్షపతి, అధ్యాపకులు పాల్గొన్నారు.
కేయూ పరీక్షల నియంత్రణాధికారి
రాజేందర్