
భూసమస్యలను వేగంగా పరిష్కరించాలి
జనగామ రూరల్: భూసమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ సెక్రటరీ లోకేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర రెవెన్యూ సెక్రెటరీ సాదాబైనామా పరిష్కారం, భూభారతి పెండింగ్ దరఖాస్తులు, ప్రభుత్వ భూములపై రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..సాదాబైనా మాకు సంబంధించి భూములు కొన్నవారికి, అమ్మినవారికి నోటీసులు ఇచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సాదాబైనామా రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..సాదాబైనామాలలో 33 వేల దరఖాస్తులు రాబోయే రోజుల్లో పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని తదనుగుణంగా అధికా రులకు అదేశాలు ఇచ్చామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి సుహాసిని, జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ ఆర్డీఓలు గోపిరామ్, డీఎస్.వెంకన్న, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ మన్నెంకొండ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
వీసీలో రాష్ట్ర రెవెన్యూ సెక్రటరీ
లోకేశ్ కుమార్