మహిళలకు ఆరోగ్య భద్రత | - | Sakshi
Sakshi News home page

మహిళలకు ఆరోగ్య భద్రత

Sep 18 2025 6:56 AM | Updated on Sep 18 2025 6:56 AM

మహిళల

మహిళలకు ఆరోగ్య భద్రత

జనగామ: కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మహిళల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. బుధవారం చంపక్‌హిల్స్‌ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్‌)లో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మల్లికార్జున్‌రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విప్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని స్వస్థనారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ ప్రోగ్రాం ఆవిష్కరించారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌ పద్ధతిలో లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ పింకేశ్‌ కుమార్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి విప్‌ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పుట్టబోయే శిశువుల సంపూర్ణ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని, కాబోయే తల్లులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా శిశు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమానికి యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసి, సేవలు ప్రారంభించాయన్నారు. ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ పింకేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. మహిళలు తమ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేస్తున్నారనే భావనతో ప్రభుత్వం బుధవారం నుంచి అక్టోబర్‌ 2 గాంధీ జయంతి వరకు 15 రోజులు పాటు ప్రతి వైద్యకేంద్రంలోనూ నిరంతరం సేవలందించనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ప్రతిరోజు వైద్య నిపుణుల పర్యవేక్షణలో సేవలు కొనసాగుతాయన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణులు ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చేందుకు తీసుకోవలసిన పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తూ, పౌష్టికాహారానికి సంబంధించి స్టాల్స్‌ ప్రదర్శించారు. ఐదు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో మాధురి షా, ఆర్డీవో గోపిరామ్‌, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఫ్లోరెనన్స్‌, ప్రొఫెసర్‌, డాక్టర్‌ గోపాల్‌రావు, ఎంసీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, ఎంసీహెచ్‌ిపీఓ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ బనుక శివరాజ్‌ యాదవ్‌, ఆర్డీఏ మెంబర్‌ అభిగౌడ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుధీర్‌, డాక్టర్లు స్వర్ణకుమారి, అజయ్‌, కమల్‌, గర్భిణులు, మహిళలు పాల్గొన్నారు.

ఎంసీహెచ్‌లో స్వస్థనారీ స్వశక్త్‌ పరివార్‌ అభియాన్‌ను ప్రారంభించిన

విప్‌ అయిలయ్య

అక్టోబర్‌ 2వరకు ప్రతీ వైద్యకేంద్రంలోనూ నిరంతర సేవలు:

ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ పింకేశ్‌ కుమార్‌

గత ప్రభుత్వ స్టిక్కర్‌పై ఆగ్రహం

జనగామ: జనగామ ఎంసీహెచ్‌లో స్వస్థనారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో బుధవారం ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య గత ప్రభుత్వం సర్జికల్‌ ప్యాకెట్‌పై ముద్రించిన స్టిక్కర్‌ను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఆరోగ్య పరీక్షలు చేసేందుకు ఏర్పాటు చేసిన చాంబర్‌ను పరిశీలించే క్రమంలో నాటి సర్కారు పేరిట ఉన్న స్టిక్కర్‌ను విప్‌ గమనించారు. ఇదేంటని ఆగ్రహం వ్యక్తం చేయడంతో..అక్కడే ఉన్న వైద్య సిబ్బంది వెంటనే దానిని తొలగించారు. మెడికల్‌ ప్యాకెట్లపై గత ప్రభుత్వ స్టిక్కర్లు ఉన్నా..ఎందుకు పరిశీలించలేదని, మొదటి తప్పుగా వదిలేస్తున్నామన్నారు. మరోసారి రిపీట్‌ కావద్దన్నారు.

మహిళలకు ఆరోగ్య భద్రత1
1/1

మహిళలకు ఆరోగ్య భద్రత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement