
స్వచ్ఛతా హీ సేవా షురూ..
జనగామ: దేశవ్యాప్తంగా పరిశుభ్రతపై ప్రజలను చైతన్యపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు తలపెట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని బుధవారం ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ప్రారంభించారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆర్డీవో గోపీరామ్, డీఆర్డీవో పీడీ వసంత, జెడ్పీసీఈఓ మాధురీ షా, డిప్యూటీ సీఈఓ సరితతో కలిసి విప్ సెల్ఫీ ఫొటోతో విప్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాధవ్, డీఈ లక్ష్మినారాయణరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పురపాలిక ఆధ్వర్యంలో..
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం పురస్కరించుకుని జనగామ పురపాలిక కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉద్యోగులు, సిబ్బంది, శానిటేషన్ కార్మికుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో స్వచ్ఛత నెలకొలిపేందుకు అంకిత భావంతో పని చేస్తామని ఉద్యోగులు, పురపాలిక చేసే కార్యక్రమంలో భాగస్వామ్యులుగా ఉంటామని ప్రజలు ప్రతిజ్ఞ చేశారు.