
రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్ పోటీలకు ఎంపిక
జఫర్‌గఢ్: మండలంలోని తమ్మడపల్లి(జి), తిడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు గాదె శ్రీజ, చెన్నూరి అంజలి రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఆయా పాఠశాలల ప్ర ధానోపాధ్యాయులు సీతారామయ్య, దామెరకొండ సదానందం, పాఠశాలల పీఈటీలు శిరంశేట్టి శ్రీధర్, గోపు నరేశ్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. వీరు ఈ నెల 22, 23, 24 తేదీల్లో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
పాలకుర్తి పాఠశాల విద్యార్థి..
పాలకుర్తి టౌన్: రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్ పోటీలకు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి ఎల్లబోయిన చరణ్ ఎంపికై నట్లు బుధవారం ప్రధానోపాధ్యాయురాలు పాయం శోభారాణి, ఫిజికల్ డైరెక్టర్ మామిండ్ల సోమ్మల్లు తెలిపారు.
గాదె శ్రీజతో ప్రధానోపాధ్యాయులు, పీఈటీ.
చరణ్‌ను అభినందిస్తున్న హెచ్‌ఎం శోభారాణి

రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్ పోటీలకు ఎంపిక