
ఉపాధ్యాయుడిని తిరిగి రప్పించండి
బచ్చన్నపేట: మండలంలోని చిన్నరామన్‌చర్లలో పనిచేసి డిప్యుటేషన్‌సై వెళ్లిన ఉపాధ్యాయుడు శ్రీని వాస్‌రెడ్డిని తిరిగి వెనక్కి రప్పించాలంటూ బుధవారం పాఠశాల ఎదుట గ్రామస్తులు, విద్యార్థులు ధర్నా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచడంతో పాటు అభివృద్ధికి శ్రీనివాస్‌రెడ్డి బాటలు వేశారని, ఉన్నతాధికారులు చొరవ తీసుకుని తిరిగి రప్పించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, పలు సంఘాల నాయకులు, తల్లిదండ్రులు గంధమల మనోహర్, బుర్రి సుధాకర్, ఆజం తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల ఎదుట గ్రామస్తుల ధర్నా