వినతులు వినరేం? | - | Sakshi
Sakshi News home page

వినతులు వినరేం?

Sep 16 2025 7:25 AM | Updated on Sep 16 2025 7:25 AM

వినతు

వినతులు వినరేం?

సమస్యల పరిష్కారానికి ఏళ్ల తరబడిగా తిరుగుతున్నాం..

25 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే

ఈఫొటోలోని దివ్యాంగుడి పేరు దుస్స కృష్ణమూర్తి. జనగామ పట్టణం వీవర్స్‌కాలనీ. 12 ఏళ్ల క్రితం పక్షవాతం రాగా కుడి చేయి, కాలు పడిపోయి మంచానికి పరిమితం అయ్యాడు. భార్య కూలీపని చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. పట్టణంలో ఎలాంటి అస్తులు లేక 25 ఏళ్లుగా అద్దే ఇంట్లో ఉంటున్నారు. వచ్చే అదాయం కిరాయికే సరిపోతుందని, డబుల్‌ బెడ్‌రూం ఇచ్చి ఆదుకోవాలని, అలాగే దివ్యాంగ పింఛన్‌ ఇచ్చి ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నాడు.

ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలి

నా భర్త అశోక్‌ 30 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఇద్దరు ఆడపిల్లలు కావడంలో బతుకుదెరువు లేక జనగామ పట్టణానికి వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నా.. అద్దె భవనంలో ఉంటున్నాం.. గ్రామంలో ఎలాంటి ఆస్తులు లేవు. పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలి.

– పానుగంటి ఆశాజ్యోతి, ఖిలాషాపూర్‌,

రఘునాథపల్లి మండలం

సర్వేనెంబర్లు హోల్డ్‌ నుంచి తొలగించాలి..

గ్రామంలో మొత్తం 15 సర్వే నెంబర్లలో సుమారు 30 ఎకరాల భూమి సాగు చేసుకుంటున్నాం. వారసత్వంగా గత 50 ఏళ్ల నుంచి ఖాస్తు ఉండి పట్టాదారుగా ఉన్నాం. సర్వే నెంబర్లు 14,182,183,192,207, 263,183, 187 193,347,700,729,730లను అధికారులు హోల్డ్‌లో పెట్టారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన రైతుభరోసా, బీమా రావడం లేదు. బ్యాంక్‌ రుణాలకు అవకాశం లేదు. సర్వే చేపట్టి తమకు పట్టాపాస్‌ పుస్తకాలు వచ్చేలా చూడాలి.

– సముద్రాల గ్రామ రైతులు, స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం

సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలి..

జనగామ మున్సిపాలిటీలోని బతుకమ్మకుంట ఎదురుగా ఉన్న దుర్గా కాలనీలో 15 సంవత్సరాలుగా ఇండ్లు నిర్మించుకొని నివాసముంటున్నాం. నేటి వరకు సీసీ రోడ్లు గాని, డ్రైనేజీ కానీ నిర్మించలేదు. వర్షాలు వస్తే వర్ష పు నీరు ఇళ్ల చుట్టూ చేరి దోమల ద్వారా రోగాలు వస్తున్నాయి. అధికా రులు తక్షణ చర్యలు తీసుకోవాలి.

– దుర్గాకాలనీ వాసులు, జనగామ

రుణమాఫీ కావడం లేదు

మండలంలోని కెనరా బ్యాంక్‌లో దశల వారీగా రెండు లక్షల యాభైవేలు పంట రుణాలు తీసుకున్నా..కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణమాఫీ చేసి ఏడాది కావొస్తున్నా మాకు లబ్ధి చేకూరలేదు. అధికారుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పెట్టుబడికి అప్పులు చేయాల్సి వస్తోంది. అధికారులు స్పందించి రుణమాఫీ అయ్యేలా చూడాలి.

– చెన్నలు భిక్షపతి, వడిచర్ల, లింగాలఘణపురం మండలం

జనగామ రూరల్‌: ‘పక్షవాతంతో మంచానికే పరిమితం అయ్యా.. పెన్షన్‌, ఇల్లు ఇచ్చి ఆదుకోవాలి.., అక్రమంగా ఎకరం భూమి ఆక్రమించారు.., ఉండడానికి ఇల్లు లేదు 30 ఏళ్ల నుంచి అద్దెభవనంలో ఉంటున్నాము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలి.., రుణమాఫీ కావడం లేదు.. విద్యుత్‌ లైన్‌ మార్చాలి..’ అని పలు సమస్యలతో ప్రజలు సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌కు తరలివచ్చారు. ఈసందర్భంగా ప్రజల నుంచి అదనపు కలెక్టర్‌లు బెన్‌షాలోమ్‌, పింకేశ్‌ కుమార్‌, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా 90మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఏళ్ల తరబడిగా కలెక్టరేట్‌ చుట్టు ప్రదక్షిణ చేసిన తమ సమస్యలు తీరడం లేదని సమయం, డబ్బులు ఖర్చవుతున్నాయని ప్రజలు అవేదన వ్యక్తం చేశారు. ప్రజల వినతులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌ సుహాసిని, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఆర్డీవోలు గోపిరామ్‌, డీఎస్‌ వెంకన్న, గ్రామీణ అభివృద్ధి అధికారి వసంత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సమయం, డబ్బులు వృథా అవుతున్నాయి..

ప్రజావాణిలో ప్రజల ఆవేదన

సత్వరమే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

వినతులు వినరేం?1
1/2

వినతులు వినరేం?

వినతులు వినరేం?2
2/2

వినతులు వినరేం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement