
రెండు స్కూళ్లకు ఇద్దరు టీచర్లు
జనగామ: జిల్లాలోని రఘునాథపల్లి మండలం నక్కబొక్కల తండా, పాలకుర్తి మండలం కిష్టాపూర్(సింగిల్ టీచర్) రెండు ప్రాథమిక పాఠశాలలకు ఇద్దరు టీచర్లను తాత్కాలిక డిప్యుటేషన్‌పై పంపించారు. ఇటీవల ప్రమోషన్లపై ఇందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వెళ్లిపోవడంతో విద్యార్థుల పరిస్థితి గందరగోళంలో పడింది. ‘పట్టాలెక్కని సర్దుబాటు–గాడితప్పుతున్న పాఠశాల నిర్వహణ’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. నక్కబొక్కల తండా పీఎస్‌కు మండలగూడెం స్కూల్‌కు చెందిన మారుతి రాజు, కిష్టాపూర్ తండా పీఎస్‌కు పలుగు బోడుతండా పాఠశాల నుంచి రమేశ్‌ను తాత్కాలిక డిప్యుటేషన్‌పై పంపించారు. బచ్చన్నపేట మండలం నక్కవానిగూడెం ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఇద్దరు ఎస్జీటీలు ఇటీవల ప్రమోష న్‌పై వెళ్లడంతో సీఆర్‌పీతో నెట్టుకొస్తున్నారు. స్కూల్‌లో 12 మంది విద్యార్థులు ఉండగా, ఇప్పటివరకు ఒక్క ఉపాధ్యాయున్ని కూడా కేటాయించలేదు.