బస్సు ఆగింది ! | - | Sakshi
Sakshi News home page

బస్సు ఆగింది !

Sep 16 2025 7:25 AM | Updated on Sep 16 2025 7:25 AM

బస్సు

బస్సు ఆగింది !

– స్వాతి, మేనేజర్‌, జనగామ డిపో – గోరంతల స్రవంతి, నర్మెట

కొట్టుకపోయిన గానుగుపహాడ్‌ జంక్షన్‌ బ్రిడ్జి మట్టి రోడ్డు

జనగామ–హుస్నాబాద్‌ ప్రధాన రహదారిపై వడ్లకొండ శివారు గానుగుపహాడ్‌ జంక్షన్‌ బ్రిడ్జి పనులు ఏళ్ల తరబడి నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రవాణా సౌకర్యంలో అంతరాయం కలగకుండా అధికారులు తాత్కాలికంగా మట్టి రహదారి ఏర్పాటు చేశారు. రెండు, మూడు నెలలుగా కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతి పెరిగి కోతలకు గురవుతూ..ఇటీవల పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో లారీలు, భారీ ట్రక్కుల రూట్‌ మారిపోగా, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు గానుగుపహాడ్‌ మీదుగా మళ్లించారు.

– జనగామ

ప్రత్యామ్నాయం లేకనే..

జనగామ డిపో నుంచి హుస్నాబాద్‌కు సోమవారం రెండు బస్సులు(6 ట్రిప్పులు) రద్దు చేశాం. గానుగుపహాడ్‌ మీదుగా వెళ్లే పరిస్థితి లేదు. గ్రామస్తులకు నచ్చజెప్పి బస్సులను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.

ఇబ్బందిగా ఉంది..

జనగామ నుంచి నర్మెటలోని బంధువుల ఇంటికి వచ్చాను. తిరిగి వెళ్లే సమయంలో రెండు గంట ల కు పైగా నిరీక్షించినా ఒక్క బస్సు కూడా రాలేదు. ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో జనం కిక్కిరిసి వెళ్తున్నారు. నర్మెట నుంచి జనగామకు రూ.50 చెల్లించాల్సి వస్తోంది.

నగామ–హుస్నాబాద్‌ రూట్‌ రెండు రాష్ట్రాలు, ఏడు జిల్లాలకు ప్రధాన రహదారి. జనగామ నుంచి వడ్లకొండ, నర్మెట, తరిగొప్పుల మీదుగా హుస్నాబాద్‌(సిద్దిపేట), కరీంనగర్‌, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ తదితర జిల్లాకు ప్రధాన రహదారి. ఇటీవల ఈ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ దారి గుండా నిత్యం హుస్నాబాద్‌కు, అటు నుంచి జనగామకు.. రెండు డిపోలకు చెందిన 6 బస్సుల(18 ట్రిప్పులు)ను నడిపిస్తున్నారు. ప్రతీరోజు 2,500 మంది వరకు ప్రయాణికులు ఆర్టీసీ సర్వీసుల్లో ప్రయాణిస్తుండగా, మరో వెయ్యి వరకు ప్రైవేటు వాహనాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన దారిలో మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బ్రిడ్జి సమస్యపై సర్కారు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోంది. గానుగుపహాడ్‌ జంక్షన్‌ వద్ద నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టి మధ్యలోనే వదిలేశారు. వాగు మధ్యలోనుంచి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టికట్టపై నుంచి ప్రమాదకర రాకపోకలు సాగించారు.

కొట్టుకుపోయిన వంతెన..

తాత్కాలిక మట్టిరోడ్డు కొట్టుకుపోవడంతో గానుగుపహాడ్‌ గ్రామం మీదుగా వాహనాలను మళ్లించారు. అయితే గ్రామంలోని చిన్న కల్వర్టు బలహీనంగా ఉండడం, దానిపై నుంచి భారీ వాహనాల రాకపోకలు పెరగడంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమ గ్రామం నుంచి భారీ వాహనాల మళ్లింపును ఆపేయాలని రాస్తారోకోకు దిగా రు. నూతన బ్రిడ్జి సమీపంలో తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడం, గానుగుపహాడ్‌లో లెవల్‌ కల్వర్టు ప్రమాదకరంగా మారడంతో హుస్నాబాద్‌ రూట్‌లో బస్సులు, భారీ వాహనాలు ప్రయాణం చేసే వీలు లేకుండా పోయింది. గానుగుపహాడ్‌ నుంచి మళ్లింపు ప్రజల నుంచి నిరసన తెలపడంతో జనగామ నుంచి హుస్నాబాద్‌ వైపు వెళ్లే సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. హుస్నాబాద్‌ డిపో నుంచి నర్మెట వరకు మాత్రమే నడిపిస్తున్నారు. దీంతో వందలా ది మంది విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధి కారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనులు పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

బ్రిడ్జి నిర్మాణంపై నిర్లక్ష్యం..

జనగామ–హుస్నాబాద్‌ రూట్‌లో నిలిచిన బస్సు సర్వీసులు

ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, విద్యార్థులు

బస్సు ఆగింది !1
1/2

బస్సు ఆగింది !

బస్సు ఆగింది !2
2/2

బస్సు ఆగింది !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement