
రాఘవాపూర్‌లో టెన్షన్ టెన్షన్
స్టేషన్‌ఘన్‌పూర్: బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోమవారం రఘునాథపల్లి మండలం కుర్చవల్లి నుంచి పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో ఆయన్ను హన్మకొండలో పోలీ సులు హౌజ్ అరెస్టు చేశారు. హౌజ్ అరెస్టు ఘటనపై మండలంలోని రాఘవాపూర్‌లో బీఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. రాజయ్య మూడో విడత పాదయాత్రను రఘునాథపల్లి మండలంలోని కుర్చపల్లి నుంచి ప్రారంభించాల్సిన పాదయాత్రకు ము ఖ్య అతిఽథిగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హాజరుకానుండగా రాఘవాపూర్ వద్ద వారికి స్వాగతం పలికేందుకు స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు మండలాల బీఆర్‌ఎస్ కార్యకర్తలు రాఘవాపూర్ వద్దకు భారీగా చేరుకున్నారు. ఏమైనా గొడవలు జరుగుతాయనే ఉద్దేశ్యంతో స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీమ్‌శర్మ ఆధ్వర్యంలో స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, చిల్పూరు తదితర మండలాల సీఐలు, ఎస్‌ఐల ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తుగా మోహరించారు.
బీఆర్‌ఎస్ శ్రేణులు, పోలీసుల తోపులాట
రాస్తారోకోలో ఎమ్మెల్యే కడియం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రయత్నించగా అక్కడే ఉన్న ఏసీపీ భీమ్‌శర్మ, సీఐ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట, వాగ్వివాదం జరిగాయి. దాంతో బీఆర్‌ఎస్ నాయకులు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఏసీపీ, సీఐ, ఎస్‌ఐలు వారికి నచ్చజెప్పి రహదారిపై నుంచి పక్కకు తీసుకువచ్చారు. కార్యక్రమంలో చల్లా చందర్‌రెడ్డి, తాటికొండ సురేష్, ఎ.బాలరాజు, రాకేష్‌రెడ్డి, నర్సింహారెడ్డి, పెసరు సారయ్య, గుండె మల్లేష్, ప్రసాద్, రంజిత్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్ శ్రేణుల నిరసన
పోలీసులు, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య తోపులాట
ఉద్రిక్తతల నడుమ కుర్చపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే రాజయ్య పాదయాత్ర