
విద్యార్థుల ఆరోగ్యం ప్రదానం
స్టేషన్‌ఘన్‌పూర్: విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై శ్రద్ధ చూపే అవకాశం ఉంటుందని, పిల్లల ఆరోగ్యం ఎంతో ప్రదానమని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. దిక్సూచి కార్యక్రమంలో భాగంగా సోమవారం విద్యార్థులకు హెల్త్ ప్రొఫైల్ కార్డులు అందించే కార్యక్రమాన్ని నమిలిగొండలోని కేజీబీవీలో ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 8 అంశాలతో రూపొందించిన దిక్సూచి కార్యక్రమంలో భాగంగా అన్ని సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్యపరీక్షలను ప్రారంభించి ప్రతీ విద్యార్థి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను హెల్త్ ప్రొఫైల్ కార్డులో నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ మల్లికార్జున్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుధీర్, డీఐఓ డాక్టర్ స్వర్ణకుమారి, ఇప్పగూడెం పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రణీత తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛోత్సవాలను విజయవంతం చేయండి
జనగామ: జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించ తలపెట్టిన స్వచ్ఛతా హీ సేవ–2025 పక్షోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలులో అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్ షాలోమ్, డీఆర్డీవో పీడీ వసంత, ఆర్డీవోలు గోపీరామ్, వెంకన్న, డీపీవో నాగపురి స్వరూప, ఎస్‌బీఎం కో ఆర్డినేటర్ కర్ణాకర్, డీఏవో అంబికా సోని, డీసీవో కోదండరాములుతో కలిసి కలెక్టర్ పోస్టర్ ఆవిష్కరించారు.
కలెక్టర్‌తో ఎమ్మెల్యే పల్లా సమీక్ష
పట్టణంతో పాటు నియోజకవర్గంలో ప్రజాఅవసరాలకు సంబంధించిన సమస్యలు, అభివృద్ధి పనులను చేపట్టడంలో జాప్యం లేకుండా చూడాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ చాంబర్‌లో ఎమ్మెల్యే పల్లా.. కలెక్టర్ రిజ్వాన్ బాషాతో నియోజకవర్గ సమస్యలపై సమీక్షించారు.
‘రాష్ట్రీయ పోషణ్ మాహ్’ను
విజయవంతం చేయాలి
జనగామ రూరల్: అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టే రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పిలుపునిచ్చారు. ఈ నెల 17వ నుంచి అక్టోబర్ 16 వరకు రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
నమిలిగొండ కేజీబీవీలో విద్యార్థినులకు హెల్త్ ప్రొఫైల్ కార్డుల అందజేత