
దుర్గామాతకు ఘన స్వాగతం
జనగామ: దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ విల్లాస్ కాలనీకి చెందిన టీమ్ ఎస్‌వీసీ వేమెళ్ల అభి ఆధ్వర్యంలో సోమవారం దుర్గామాత ప్రతిమకు భక్తిశ్రద్ధలతో స్వాగతం పలికారు. నెహ్రూపార్కు ఏరియా నుంచి వందలాది మంది మహిళలు, భక్తులు, పురప్రముఖులు, టీం ప్రతినిధుల ఆధ్వర్యంలో మేళ తాళాలు, భజనలు, ఆటాపాటలతో శ్రీ విల్లాస్ కాలనీ వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, కంచె రాములు, సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు.