
ప్రశాంతంగా సర్వేయర్ల పరీక్ష
● ఆరుగురు అభ్యర్థుల గైర్హాజరు
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలో ఏబీవీ డిగ్రీ కళాశాలలో సైన్స్ సర్వేయర్‌ల సప్లిమెంటరీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని నోడల్ అధికారి మన్యంకొండ, పరీక్ష కన్వీనర్ నూకరాజు ఆదివారం తెలిపారు. 166 మందికి గాను ఆరుగురు గైర్హాజరయ్యారన్నారు. రెండు దశల్లో పరీక్షలు జరగగా మొత్తం 166 మందికి గాను ఉదయం పరీక్షలకు 74 మందికి గాను 69 మంది హాజరుకాగా ఐదుగురు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 92 మందికి 91 మంది హాజరు కాగా ఒక్కరు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల వసతులు కల్పించామన్నారు. పరీక్ష కేంద్రాన్ని డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ పండారీ చేతన్ నితిన్ పరిశీలించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా చర్యలు చేపట్టారు.