
నాణ్యమైన వైద్యసేవలందించాలి
బచ్చన్నపేట: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన సేవలను అందించాలని, వైద్యులు సమయపాలన పాటించాలని రాష్ట్ర వైద్యశాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని గదులను, ఆపరేషన్ పరికరాలను, యంత్రాలను, మందుల నిల్వలను, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్ర స్తుత వర్షాకాల సీజన్‌లో చాలా మందికి విషజ్వరా లు వస్తున్నాయని, జబ్బుల బారిన పడిన వారు ఆసుపత్రిలో చికిత్స తీసుకునేలా చూడాలని, వారికి అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకో వాలని తెలిపారు. కార్యక్రమంలో డీఐఓ స్వర్ణకుమా రి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్, ప్రోగ్రామ్ ఆఫీస ర్ లగిషెట్టి అశోక్‌కుమార్, వైద్యులు మానస, రా ములు, సూపర్‌వైజర్ అనురాధ, స్టాఫ్ నర్సు కవిత, ఫార్మసిస్ట్ బొడ్డు శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర వైద్యశాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్