
రాజీమార్గంతోనే సమస్యల పరిష్కారం
– 8లోu
జనగామ రూరల్: రాజీమార్గంతోనే కక్షిదారుల సమస్యలు పరిష్కారమవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్‌ను ఆమె ప్రారంభించారు. లోక్ అదాలత్‌లో 6 బెంచ్‌ల ద్వారా ఫిర్యాదులను పరిష్కరించారు.
● మొదటి బెంచ్ ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ, సభ్యులుగా బి.సంగీత
● రెండో బెంచ్‌కు సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్, సభ్యులుగా రెడ్డబోయిన రాజు
● మూడో బెంచ్‌కు సీనియర్ సివిల్ జడ్జి ఇ.సుచరిత, సభ్యులుగా కె. పుష్ప
● నాలుగో బెంచ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి.శశి, సభ్యులుగా ఇ. జ్యోత్స్న
● ఐదో బెంచ్‌కు కె.సందీప, సభ్యులుగా జి. రేఖ
● ఆరో బెంచ్‌కు స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ డి.వెంకట్రాంనరసయ్య, ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ
కేసుల రాజీ ఇలా..
ఓ మోటార్ యాక్సిడెంట్ కేసులో కక్షిదారులకు రూ.2,30,000ల అవార్డు అందించారు. ఈ సందర్భంగా కక్షిదారుడు కె.మహేశ్ ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఎంవీఓపీ కేసులో ఎం.వీరస్వామికి రూ.7,25,000 అవార్డు ఇవ్వడం జరిగినది. జాతీ య లోక్ అదాలత్‌కు వచ్చిన కక్షిదారులకు మధ్యాహ్నం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కోర్టు కేసుల్లో ముఖ్యంగా సివిల్, క్రిమినల్, మోటా ర్ యాక్సిడెంట్, ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్, ఫ్యామిలీ కేసులు పరిష్కరించారు. మొత్తం సివిల్ కేసులు 10, మోటార్ యాక్సిడెంట్ కేసులు 8 రాగా 39 లక్షల 30 వేల రూపాయలు వసూలు చేశారు. క్రిమినల్ కేసులు 5,778, ప్రీ లిటిగేషన్ కేసులు 461, మొత్తం 6,257 కేసులు పరిష్కారం కాగా రూ.94,59,667 వచ్చాయి. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్, న్యాయవాదులు, లయన్స్ క్లబ్ ప్రతినిధి బి.దయాకర్‌రెడ్డి, డాక్టర్ రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాదులకు శిక్షణ
తరగతులు అవసరమే
హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్
డీసీసీబీ భవన్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ
జాతీయ లోక్ అదాలత్‌లో
6,257 కేసుల పరిష్కారం