
ఘనంగా జల్సా, నాథియా ముషాయిరా
జనగామ రూరల్: ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఈద్–ఏ–మిలాద్–ఉన్–నబీ పర్వదిన సందర్భంగా శనివారం పట్టణంలో గిర్నిగడ్డ చౌరస్తాలో జిల్లా ముస్లిమ్ డెవలప్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు మ హమ్మద్ జామాల్ షరీఫ్ అధ్యక్షతన జల్సా, నాథి యా ముషాయిరా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఉర్దూ దినపత్రిక ఎడిటర్, మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, డీసీపీ రాజమహేంద్రనాయక్, మార్కెట్ చైర్మన్ బి.శివరాజ్ యాదవ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా అమీర్ అలీఖాన్ మాట్లాడుతూ.. ముస్లిములు ఐదు పూటలు నమాజ్ చేయాలన్నారు. ఖరాన్ హదీస్ ముస్లింలు పాటించాలని సూచించారు. డీసీపీ రా జామహేంద్ర నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో హిందూ, ముస్లిములు కలసి పండగలు జరుపుకుంటారని, మతసామర్యంగా ఉంటారని అభినందించారు. కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, ముజీబ్ ఊరు రెహ్మాన్, మౌలానా జాక్రియా సబ్, రఫ్ మతీన్ అ డ్వకేట్, అంకుశవాలి, అబ్దుల్ మన్నాన, మేడ శ్రీను, కర్నాకర్‌రెడ్డి, బాసిత్ తదితరులు పాల్గొన్నారు.